శోధన
తెలుగు లిపి
  • English
  • 正體中文
  • 简体中文
  • Deutsch
  • Español
  • Français
  • Magyar
  • 日本語
  • 한국어
  • Монгол хэл
  • Âu Lạc
  • български
  • Bahasa Melayu
  • فارسی
  • Português
  • Română
  • Bahasa Indonesia
  • ไทย
  • العربية
  • Čeština
  • ਪੰਜਾਬੀ
  • Русский
  • తెలుగు లిపి
  • हिन्दी
  • Polski
  • Italiano
  • Wikang Tagalog
  • Українська Мова
  • ఇతరులు
  • English
  • 正體中文
  • 简体中文
  • Deutsch
  • Español
  • Français
  • Magyar
  • 日本語
  • 한국어
  • Монгол хэл
  • Âu Lạc
  • български
  • Bahasa Melayu
  • فارسی
  • Português
  • Română
  • Bahasa Indonesia
  • ไทย
  • العربية
  • Čeština
  • ਪੰਜਾਬੀ
  • Русский
  • తెలుగు లిపి
  • हिन्दी
  • Polski
  • Italiano
  • Wikang Tagalog
  • Українська Мова
  • ఇతరులు
శీర్షిక
ట్రాన్స్క్రిప్ట్
తదుపరి
 

వాతావరణ మార్పు అంతర్జాతీయ సదస్సు లో, 18 యొక్క 18 వ భాగం

వివరాలు
డౌన్లోడ్ Docx
ఇంకా చదవండి
ఈ చివరి ఎపిసోడ్‌లో, మార్పును ప్రేరేపించడంలో మీడియా పాత్రపై వక్తలు తమ అభిప్రాయాలను పంచుకోగా, గ్లోబల్ వార్మింగ్‌కు వీగనిజం ఒక ఆశాజనకమైన పరిష్కారమని పేర్కొంటూ సుప్రీం మాస్టర్ చింగ్ హై ముగింపు అంతర్దృష్టులను అందిస్తారు.

John Raatz: సంక్షిప్తంగా చెప్పాలంటే, సాధ్యమైనంత వరకు నా సాధారణ కార్యాచరణ సూత్రం ఏమిటంటే “మీడియా వెంట పడకండి.” "మీరే మాధ్యమంగా ఉండండి" అనే సూత్రం ప్రకారం పనిచేయండి, అంటే అత్యున్నతమైన దానికే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి. అది ఒక ఆశయం అయినా, లేదా మరీ ముఖ్యంగా చైతన్యం మరియు పరివర్తన అయినా, దానికోసమే వెళ్ళండి. మీ విధానాన్ని, మీ ఎత్తుగడను, మీ వ్యూహాన్ని మరియు మొదలైనవాటిని ఎంచుకోవడానికి అదే మీకు మార్గదర్శక సూత్రంగా ఉండనివ్వండి.

కాబట్టి, చాలా సమస్యలు ఉన్నాయి, వాటిని చూసి తల తిరుగుతోంది. మరియు బహుశా మీకు “కరుణా అలసట” అనే పదం కూడా తెలిసి ఉండవచ్చు. చేయవలసిన పనులు చాలా ఉన్నాయి, కానీ వాటిని చేయడానికి మాకు ఎక్కువ సమయం లేదు. మరి మీరు ఎలా ఎంచుకుంటారు?

అయితే, మీ అంతరంగానికి ఏమనిపిస్తుందో దానికి అనుగుణంగా నడుచుకోండి, మీరు దేనిని అనుసరించాలో అనే విషయంలో మీ అంతర్బుద్ధికి అనుగుణంగా ఉండండి, మరియు ప్రధాన స్రవంతి మీడియాను వెంబడించకండి, మీరే మీడియాగా మారండి. సామాజిక మార్పును తీసుకురావడానికి ప్రస్తుతం ఇంటర్నెట్ అత్యంత ప్రభావవంతమైన సాధనం కాబట్టి, దానిని ఉపయోగించండి. మీకు తెలిసినట్లుగా, మార్కెటింగ్, ప్రజా సంబంధాలు మరియు ప్రచార దృక్కోణం నుండి మీడియాను ఉపయోగించుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. మరియు ప్రస్తుతం ప్రజలలో చైతన్యం కలిగించడానికి ఇది ఉత్తమ మార్గాలలో ఒకటి అని నేను భావిస్తున్నాను.

ఒక చిన్న ఉదాహరణ: ప్రస్తుతం 'ది షిఫ్ట్' అనే పేరుతో ఒక సినిమా నిర్మాణ దశలో ఉంది. 'ది షిఫ్ట్' ట్రైలర్ విడుదలైన వెంటనే, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు దానిని చూశారు. మరియు ఈ సినిమా, ప్రపంచంలో మార్పును సృష్టిస్తున్న వ్యక్తులు, కంపెనీలు మరియు సంస్థల గురించి వివరిస్తోంది – ప్రధాన స్రవంతి మీడియా దాని గురించి నివేదించే వరకు వేచి ఉండకుండా, “ఈ వ్యక్తులు ఏమి చేస్తున్నారో చూడండి” అని చెబుతోంది. మరియు దానికి అపారమైన మద్దతు ఉంది. కాబట్టి చైతన్యం మరియు పరివర్తన అనే వాటిని ప్రోత్సహించడానికి- మీ హృదయాన్ని, మీ అంతర్బుద్ధిని, మీ చైతన్యాన్ని ఉపయోగించండి. వాటి యొక్క ఏ రూపాలు మీకు వ్యక్తమైనా, వాటితోనే ముందుకు సాగండి.

Master: చాలా బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది, జాన్. రాట్జ్ గారు, చాలా బాగుంది. (జాన్ మరియు స్కాట్, మీకు చాలా ధన్యవాదాలు.)

Scott Baden-Notch: కాబట్టి, మీరు గమనించినట్లుగా, చైతన్యవంతమైన మీడియాకు తగిన శ్రద్ధ తీసుకోబడుతోంది. జాన్ రాట్జ్ మరియు ఎలిజబెత్ ఎస్ట్రాడాస్ మరియు డారిల్ మర్చంట్ యొక్క ఎలివేట్ ఫిల్మ్స్, ఫ్రీ రేంజ్ స్టూడియోస్ – వీళ్ళు ఈ పనిని చేస్తున్నారు, మరియు చాలా చాలా బాగా చేస్తున్నారు, భవిష్యత్తులో వారు ఏమి తీసుకువస్తారో చూడటానికి నేను ఎదురుచూస్తున్నాను. నేను చెప్పే ఒక విషయం ఏమిటంటే, ఇది ఒకరకమైన ఆచరణాత్మక విషయం. ప్రజలు తమ చైతన్యాన్ని మార్చుకుంటే, వారు తమ దైనందిన జీవితంలో కూడా నిలదొక్కుకోగలరనేది చాలా స్పష్టమైనప్పటికీ, ఎందుకంటే చైతన్యమే మొదటి అడుగు, కానీ, ముఖ్యంగా ఈ దేశంలోని కొన్ని ప్రాంతాలలో ప్రజలకు ఒక పెద్ద అంతరం ఉందని నేను భావిస్తున్నాను, అదేమిటంటే పూర్తిగా అచేతన స్థితి నుండి చైతన్యవంతమైన స్థితికి ఆ ముందడుగు వేయడం వారికి కొంత కష్టంగా ఉంది. కాబట్టి, ప్రజలకు పరిష్కారాలు ఇవ్వడం - మనం దృష్టి సారించే విషయాలు - వారికి నిజంగా ఆచరణాత్మకంగా, వాస్తవికంగా ఉండే విషయాలు... కాబట్టి మేము ప్రస్తుతం ఫ్రీ రేంజ్ స్టూడియోస్‌తో కలిసి, సృజనాత్మక పరిష్కారాల గురించిన ఒక సినిమాను తీసుకురావడానికి పని చేస్తున్నాము – అంటే, పర్యావరణాన్ని మరియు తమను తాము కాపాడుకోవడానికి ప్రజలు తమ దైనందిన జీవితంలో చేయగలిగే పనుల గురించి. మరియు నేను నిజంగా లక్ష్యంగా చేసుకోవాలనుకుంటున్న ఒక రంగం అదే – నిజమైన చైతన్యం పొందడానికి ఇంకా చాలా దూరంలో ఉన్న ఒక జనాభా సమూహం. కానీ మిగతాదంతా చాలా చాలా మంచి చేతుల్లో ఉందని నాకు నమ్మకం ఉంది.

(మా ప్యానెనుండి అద్భుతమైన సమాధానాలు.) ఇక ఇప్పుడు మనం సర్వోన్నత గురువుగారి వద్దకు మరియు ఆమె ముగింపు ఆలోచనల వద్దకు వెళ్దాం. మరియు సుప్రీమ్ మాస్టర్ చింగ్ హై, మీరు ఇదంతా సంగ్రహంగా చెప్పగలిగితే. మనం చాలా విషయాలను చర్చించాము. మనం ఆధ్యాత్మికత గురించి చర్చించాము. మేము గ్లోబల్ వార్మింగ్ సంక్షోభం గురించి మరియు అమెరికన్లు, మిగతా ప్రపంచం వారి ఆహార వినియోగ అలవాట్లకు దానికున్న సంబంధం గురించి చర్చించాము. మేము పరివర్తనాత్మక మీడియా గురించి చర్చించాము. అక్కడ ఉన్న ఉమ్మడి అంశం ఏమిటి? మనం దీన్ని మనతో పాటు తీసుకువెళ్లగలిగేలా ఎలా కుదించాలి?)

Master: మంచి ప్రశ్న. జేన్ మరియు గౌరవనీయులారా, నేను చాలా సామాన్యమైన మహిళను. ప్రతిదానికీ కొంత సమయం పడుతుందని మాత్రమే మనం చెప్పగలం. ఈ విషయంలో మీడియాను భాగస్వామ్యం చేయడానికి కొంత సమయం పట్టవచ్చు. సుస్థిర ఇంధన సాంకేతికతను అభివృద్ధి చేయడానికి కొంత సమయం పడుతుంది. తక్కువ కాలుష్యం కలిగించే కొత్త కార్లను ఆవిష్కరించడం, వాటి ఉత్పత్తికి చాలా కాలం పడుతుంది – కొన్ని సంవత్సరాల కంటే ఎక్కువ సమయం – మరి మనకు అంత సమయం లేదు. అందుకే ప్రతిదానికీ నా దగ్గర ఒకే ఒక పరిష్కారం ఉంది – అదే వేగన్ ఆహారం. కాబట్టి ఇప్పుడు, ప్రజలు వేగన్లుగా ఉండటానికి అంగీకరిస్తే, నేను ఇప్పటికే చాలా కృతజ్ఞతతో

ఉంటాను. మరియ మనమందరం లేదా కనీసం మనలో అధిక శాతం మంది వేగన్ లుగా మారినప్పుడు, ఈ గ్రహం యొక్క కర్మ మారుతుంది – అంటే మన విధి యొక్క సరళి మారుతుంది – మరియు ప్రతిదీ మెరుగవుతుంది. మరియు మనం భూమికి నష్టం కలిగించకుండా మన సౌకర్యం కోసం మరెన్నో ఉత్తమమైన వస్తువులను ఆవిష్కరిస్తాము. మరియు వేగన్ ఆహారం భూతాపాన్ని దాదాపు తక్షణమే ఆపేస్తుంది. రెండు వారాల నుండి రెండు సంవత్సరాల వరకు – అదే గరిష్టం. గరిష్టంగా రెండు సంవత్సరాలలోపు. లేకపోతే, మనమందరం వేగన్లుగా మారితే, లేదా మనలో దాదాపు అందరూ వేగన్ గా మారితే, దాని ప్రభావం వెంటనే కనిపించడానికి బహుశా రెండు లేదా మూడు నెలలు పట్టవచ్చు. ఉదాహరణకు, మంచు తిరిగి దాని పూర్వస్థితికి చేరుకుంటుంది, భూమి మళ్ళీ చల్లబడుతుంది, మన జీవితం మరింత సుసంపన్నమవుతుంది, మరియు యుద్ధాలు ఆగిపోతాయి.

ప్రతిఒక్కరూ పూర్తిగా భిన్నంగా ఆలోచిస్తారు. వారు ఒకరితో ఒకరు పూర్తిగా భిన్నంగా ప్రవర్తిస్తారు, ఎందుకంటే వారి హృదయంలోని కరుణ మళ్ళీ దాని స్వచ్ఛమైన శక్తిని తిరిగి పొందుతుంది. ప్రస్తుతం, ఈ (జంతు-ప్రజల) మాంసం మరియు విషం – మత్తుపదార్థాలు, సిగరెట్లు, మరియు మద్యం – వీటన్నింటి కారణంగా, ఈ విషపూరితమైన వాటిని ఉపయోగించడం ద్వారా మనం సృష్టించిన ప్రతికూల శక్తి యొక్క బరువుతో ప్రజలలోని కరుణామయ స్వభావం అణచివేయబడుతోంది, ముఖ్యంగా హత్యాశక్తి – మనం మనకు చేసుకోగల అత్యంత ఘోరమైన పని ఇదే. కాబట్టి, నా దగ్గర ఒకే ఒక పరిష్కారం ఉంది, అదే వేగన్ గా మారడం, అది కూడా ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. ఇక మిగతా విషయాలన్నీ చూసుకోవడానికి మనకు సమయం ఉంటుంది. విభిన్న సాంకేతికతను అభివృద్ధి చేయడానికి మనకు సమయం ఉంటుంది. కొత్త కార్లను ఆవిష్కరించడానికి మనకు సమయం ఉంటుంది. భూమి వేడెక్కడం అంత అత్యవసరం కాని అనేక ఇతర విషయాలను పరిష్కరించడానికి మనకు సమయం ఉంటుంది. ఎందుకంటే, నిజంగా, అది ఈ గ్రహం మొత్తాన్ని నాశనం చేయవచ్చు మరియు మనమందరం అంతరించిపోతాము.

సరే, వెళ్ళడానికి నాకేమీ అభ్యంతరం లేదు. అదే విషయం – మరి ఈ భూమి మీద బ్రతకాలని ఇష్టపడే, బ్రతకాలనుకునే ఇతర ప్రజల సంగతేంటి? ఎందుకంటే వారు వెళ్ళగలిగే మరో ప్రదేశం ఉందని వారికి ఇంకా తెలియదు. మరియు వారు అటువంటి పరిస్థితిలో మరణిస్తే, వారి ఆధ్యాత్మిక ఉన్నతికి చాలా కష్టమవుతుంది. మరియు ఇది ఇప్పటికీ చాలా అందమైన గ్రహం, దీనిని ఇంకా బాగుచేయవచ్చు. కాబట్టి ఒకే ఒక్క అభ్యర్థన: వేగన్ ఆహారం. అప్పుడు మిగతావన్నీ చేయడానికి, ఆలోచించడానికి మనకు సమయం ఉంటుంది. చాలా సులభం.

భూతాపంలో ఎనభై శాతం (జంతు-మానవ) మాంసాహారం వల్ల కలుగుతుంది, కాబట్టి (జంతు-ప్రజల) మాంసాహారాన్ని విడిచిపెట్టి, వేగన్ ఆహారాన్ని స్వీకరించడం ద్వారా భూతాపంలో ఎనభై శాతం సమస్యను పరిష్కరించవచ్చు. ఇక మిగిలిన 20 శాతం విషయానికొస్తే, నిజానికి దానితో ఏ సమస్యా లేదు. మనం కార్లు, విమానాలు, రైళ్లను వాడుతూనే ఉన్నా, తరచుగా స్నానాలు చేసినా కూడా, దానివల్ల పెద్దగా నష్టం ఏమీ ఉండదు, ఎందుకంటే అది కేవలం 20% కాలుష్యం, కేవలం 20% నష్టం మాత్రమే – మిగతాదంతా భూమి మన కోసం చూసుకోగలదు. నిజంగా, అది అంతే. కాబట్టి వేగనిస్మ్న్ని, దాని ప్రయోజనాల గురించిన సమాచారాన్ని వ్యాప్తి చేయండి. మరియు భూమికి, మన పిల్లలకు మనం చేయగలిగిన అత్యుత్తమమైన పని అదే. నన్ను ఆహ్వానించినందుకు మీకు చాలా ధన్యవాదాలు. నాపై మీకున్న నమ్మకానికి, ప్రేమకు చాలా ధన్యవాదాలు. మీ అందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను. మరియు మీ లక్ష్య సాధనలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. ధన్యవాదాలు.

Jane Velez-Mitchell: ధన్యవాదాలు, సర్వోన్నత గురువు చింగ్ హై. నేను డోనాల్డ్ తరపున మాట్లాడుతున్నాను, నాకుఖచ్చితంతెలుసు, ఇది జరిగి ఉంటుంది…. ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని చూసే మరియు ఎంతో మంది అద్భుతమైన, పరిణతి చెందిన వ్యక్తులను కలిసే అవకాశం లభించినందుకు నేను వినమ్రతతో, గౌరవంగా భావిస్తున్నాను, ఇది నాకు ఆశను కలిగిస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రపంచంలో జరుగుతున్న వాటి గురించి కొన్నిసార్లు నాకు నిరాశ కలుగుతుంది. ఈ రాత్రి కార్యక్రమాన్ని ముగిస్తున్న తరుణంలో, ఆశకు ఎన్నో కారణాలు ఉన్నాయి. ఇక్కడ కాలిఫోర్నియాలో, నవంబర్ బ్యాలెట్‌లో ప్రాప్ 2 అనే ఒక ప్రతిపాదన ఉందని మీకు చెప్పాలనుకుంటున్నాను. దీనినే వ్యవసాయ జంతువులపై క్రూరత్వ నివారణ చట్టం (Prevention of Farm Cruelty Act) అని కూడా అంటారు. ఇది పందుల గర్భధారణ క్రేట్‌లు, దూడల క్రేట్‌లు మరియు బ్యాటరీ క్రేట్‌లను నిషేధిస్తుంది. ఇది నవంబర్ బ్యాలెట్‌లో ఉంది, కాబట్టి మీరు ప్రాప్ 2కు అనుకూలంగా ఓటు వేయవచ్చు. (వావ్.) మరియు ఈ వారాంతంలో, మేము అన్నిచోట్లా పార్టీలు నిర్వహిస్తున్నాము. రేపు బెవర్లీ హిల్స్‌లో నేను ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నాను, దానికి 375 మంది హాజరవుతారని ప్రకటించారు. “ఈ క్రూరత్వాన్ని ఆపడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పడానికి హాలీవుడ్‌లోని ప్రజలందరూ అక్కడికి వస్తున్నారు.”

అయితే, (వావ్.) మనం శ్రద్ధ వహించే వ్యక్తులం, మనం ఈ పరిస్థితిని మార్చబోతున్నాం, మరియు ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించగలం – అక్షరాలా రేపు నిద్రలేవగానే, కేవలం మనం మాత్రమే వేగన్ లుగా మారడం ద్వారా కాదు. మరియు నేను వీగన్‌ని, మరియు ఇక్కడ సభికులలో చాలామంది, మీ చేతులు పైకెత్తి చెప్పండి, మీరు శాకాహారులా లేదా వీగన్‌లా? మీలో ఎంతమంది ఉన్నారు? సరే, సరిగ్గా అక్కడే, అది చాలా బాగుంది! ఇక దీని తర్వాత మీలో మిగిలిన వారందరకూడా మీ దారిలో ఉన్నార నేఖచ్చితం అనుకుంటున్నాను! మీరు వస్తున్నారు! కాబట్టి, నాలో ఆశ నిండిపోయింది, మనం ముందుకు సాగుతూనే ఉంటామని, ఈ ప్రపంచాన్ని ఒక కరుణామయ ప్రదేశంగా, ఒక కరుణామయ గ్రహంగా మారుస్తామనే నమ్మకం నాకు మళ్ళీ కలిగింది, కదా? (అవును.) (అవును!) చేద్దాం! (అవును, అవును.)

Donald: మరియు నా భార్య వాలెంటినా తరపున, ఈ వారాంతంలో ఈ కార్యక్రమానికి సహాయం చేయడానికి వచ్చిన మిగిలిన కెనడియన్ బృందం తరపున, మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు సుప్రీం మాస్టర్ చింగ్ హాయ్‌కి మరియు మా అద్భుతమైన లాస్ ఏంజిల్స్ ఆతిథేయునికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు చేసిన ప్రతిదానికీ మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము మరియు ఈ రోజు మీరు నేర్చుకున్న దానిని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేయడంలో మీకు అన్ని విధాలా శుభం కలగాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు.

Master: ధన్యవాదాలు! అందరికీ ధన్యవాదాలు, నిజంగా చాలా ధన్యవాదాలు. ధన్యవాదాలు, జేన్. ధన్యవాదాలు, డోనాల్డ్. నిర్వాహకులందరికీ, ప్యానెళ్లకు, గొప్ప వ్యక్తులకు – మీ అందరికీ మా ధన్యవాదాలు. నిర్వాహక బృందానికి కూడా ధన్యవాదాలు, దేవుడు మీ అందరినీ దీవించుగాక. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఇక సెలవు. మరియు మీరు ఇంకా వేగన్ కాకపోతే, దయచేసి వేగన్లుగా మారండి. ప్రయత్నించి చూడండి; అది ప్రపంచాన్ని భిన్నమైన కోణంలో చూడటానికి, స్వర్గానికి మరింత చేరువ కావడానికి మీకు సహాయపడుతుంది. కనీసం నాకైతే, ప్రాణులన్నీ ఒకదానికొకటి భయం లేకుండా జీవించే ప్రపంచాన్ని ఊహించుకోండి. మనమందరం వేగన్లుగా ఉంటాము మరియు మనమందరం స్వర్గం నుండి వచ్చే ఆనందం మరియు ఆశీర్వాదాలతో జీవిస్తాము. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. వెళ్లి మీ (వేగన్) విందును ఆస్వాదించండి. వీడ్కోలు.

Photo Caption: “ హాయ్, అంతా దేవుడిచ్చిన అందమైన జీవితమా!”

ఫోటో డౌన్లోడ్ చేయండి   

మరిన్ని చూడండి
అన్ని భాగాలు (18/18)
1
జ్ఞాన పదాలు
2026-04-13
5216 అభిప్రాయాలు
2
జ్ఞాన పదాలు
2026-04-14
4829 అభిప్రాయాలు
3
జ్ఞాన పదాలు
2026-04-15
4643 అభిప్రాయాలు
4
జ్ఞాన పదాలు
2026-04-16
4764 అభిప్రాయాలు
5
జ్ఞాన పదాలు
2026-04-17
4720 అభిప్రాయాలు
6
జ్ఞాన పదాలు
2026-04-18
4646 అభిప్రాయాలు
7
జ్ఞాన పదాలు
2026-04-20
4726 అభిప్రాయాలు
8
జ్ఞాన పదాలు
2026-04-21
4688 అభిప్రాయాలు
9
జ్ఞాన పదాలు
2026-04-22
4708 అభిప్రాయాలు
10
జ్ఞాన పదాలు
2026-04-23
4735 అభిప్రాయాలు
11
జ్ఞాన పదాలు
2026-04-24
5047 అభిప్రాయాలు
12
జ్ఞాన పదాలు
2026-04-25
5069 అభిప్రాయాలు
13
జ్ఞాన పదాలు
2026-04-27
4950 అభిప్రాయాలు
14
జ్ఞాన పదాలు
2026-04-28
4786 అభిప్రాయాలు
15
జ్ఞాన పదాలు
2026-04-29
4575 అభిప్రాయాలు
16
జ్ఞాన పదాలు
2026-04-30
4079 అభిప్రాయాలు
17
జ్ఞాన పదాలు
2026-05-01
4266 అభిప్రాయాలు
18
జ్ఞాన పదాలు
2026-05-02
4869 అభిప్రాయాలు
మరిన్ని చూడండి
తాజా వీడియోలు
4:40

GLOBAL DISASTERS, SEPTEMBER 2026

181 అభిప్రాయాలు
లఘు చిత్రాలు
2026-10-26
181 అభిప్రాయాలు
12:15

No-Pain and Have-Pain Foods, Part 40

195 అభిప్రాయాలు
లఘు చిత్రాలు
2026-10-26
195 అభిప్రాయాలు
గమనార్హమైన వార్తలు
2026-10-26
2116 అభిప్రాయాలు
గమనార్హమైన వార్తలు
2026-10-26
242 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2026-10-26
200 అభిప్రాయాలు
1:14

Here’s how to make a fresh carrot and cucumber salad.

430 అభిప్రాయాలు
గమనార్హమైన వార్తలు
2026-10-25
430 అభిప్రాయాలు
లఘు చిత్రాలు
2026-10-25
514 అభిప్రాయాలు
లఘు చిత్రాలు
2026-10-25
1376 అభిప్రాయాలు
షేర్
భాగస్వామ్యం చేయండి
పొందుపరిచిన
దీని వద్ద ప్రారంభించు
డౌన్లోడ్
మొబైల్
మొబైల్
ఐఫోన్
ఆండ్రోయిడ్
మొబైల్ బ్రౌజర్లో చూడండి
GO
GO
అప్ప్
QR కోడ్ను స్కాన్ చేయండి లేదా డౌన్లోడ్ చేయడానికి సరైన ఫోన్ సిస్టమ్ను ఎంచుకోండి
ఐఫోన్
ఆండ్రోయిడ్
Prompt
OK
డౌన్లోడ్